బ్రేకింగ్ : నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న జగన్
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి [more]
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి [more]
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 31 వ తేదీ నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్ పదో తరగతి పరీక్షలు యధాతథంగా జరుగుతాయని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో టెన్త్ పరీక్షలను హైకోర్టు వాయిదా వేసిందని మీడియా గుర్తు చేసినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకూ టెన్త్ పరీక్షలు జరగాల్సి ఉంది.