మూడు గంటలే రిలీఫ్

ఏపీ లో లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆయన కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం పలు చర్యలు చేపట్టాలని [more]

Update: 2020-03-24 02:41 GMT

ఏపీ లో లాక్ డౌన్ ను కఠినంగా అమలుచేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఆయన కరోనాపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన అనంతరం పలు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి 9గంటల వరకూ మాత్రమే నిత్యావసరవస్తువుల దుకాణాలు, పెట్రోలు బంకులు తెరుచుకుని ఉంటాయి. ఆ సమయంలోనే రోడ్లపైకి ప్రజలను అనుమతిస్తారు. ఉదయం 9గంటల తర్వాత బయట ఎవరు కన్పించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 7గంటల వరకూ టేకే ఎవే హోటల్స్ కు మాత్రం అనుమతిచ్చారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ స్టోర్స్ తప్ప మరేవీ తెరుచుకుని ఉండటానికి వీలు లేదని ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల సరిహద్దులను మూసివేసిన ప్రభుత్వం నేటి నుంచి జిల్లా సరిహద్దులను కూడా మూసివేయాలని నిర్ణయించింది.

Tags:    

Similar News