అంతటి గోప్యత ఎందుకని ప్రశ్నిస్తే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేటినీ ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేటినీ ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను వేటినీ ఆన్ లైన్ లో పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం విడుదల చేసే జీవోలు ఆన్ లైన్ పెడుతుండటం 2008 నుంచి సంప్రదాయంగా వస్తుంది. అయితే ఈ విధానానికి స్వస్తి పలుకుతూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక పరమైన విషయాలు బయటకు పొక్కుతుండటంతో పాటు, కొన్ని కీలక శాఖలకు సంబంధించి ముందుగానే తెలిసిపోతుండటంతో వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు. దీనిపై రచ్చ అయ్యే అవకాశముంది. ప్రజా ప్రభుత్వం లో గోప్యత ఎందుకన్న విపక్షాలు వేసే ప్రశ్నకు వైఎస్ జగన్ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుంది.