నేడు పి.గన్నవరానికి జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పి.గన్నవరంలో ఆయన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాడు నేడు కార్యక్రమం కింద నిర్మితమైన పాఠశాలను పి. గన్నవరంలో [more]

Update: 2021-08-16 02:25 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. పి.గన్నవరంలో ఆయన కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాడు నేడు కార్యక్రమం కింద నిర్మితమైన పాఠశాలను పి. గన్నవరంలో జగన్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాకానుకను జగన్ అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.

Tags:    

Similar News