నాది భరోసా

రాష్ట్రంలో రైతులందరినీ ఆదుకునే లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను [more]

Update: 2020-01-22 08:53 GMT

రాష్ట్రంలో రైతులందరినీ ఆదుకునే లక్ష్యంగానే ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నాటికి 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు శాసనసభలో జగన్ ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలపై ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రంలో విత్తన పరీక్షలు కూడా చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని చెప్పిన సమయం కంటే ముందు అమలు చేశామన్నారు. రైతుల కోసం వడ్డీ లేని రుణాలను అందిస్తున్నామని చెప్పారు. పగటి పూట రైతులకు 9గంట నిరాటంకంగా విద్యుత్ ను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కొత్తగా పశువులకు హెల్త్, బీమా కార్డులను ఇస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News