విమర్శలకు చెక్ పెట్టిన జగన్ ప్రభుత్వం

ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం రహదారులపై దృష్టి పెట్టింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే రాష్ట్రంలో రోడ్ల పరిస్థిితి అద్వాన్నంగా ఉంది. దీనిపై అనేక [more]

Update: 2021-03-12 01:04 GMT

ఎట్టకేలకు జగన్ ప్రభుత్వం రహదారులపై దృష్టి పెట్టింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తుంది. అయితే రాష్ట్రంలో రోడ్ల పరిస్థిితి అద్వాన్నంగా ఉంది. దీనిపై అనేక విమర్శలు వచ్చాయి. బీజేపీ, టీడీపీలు కూడా ఆందోళనలు చేశాయి. తాజాగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు 2,205 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో 7,969 కిలోమీటర్ల రహదారుల్లో మరమ్మతులను చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర, జిల్లా రహదారులున్నాయి. రాష్ట్ర రహదారి కార్పొరేషన్ ద్వారా ఈ నిధుల కేటాయింపుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. దీంతో ఏపీలో రహదారుల మరమ్మతులు పెద్దయెత్తున జరగనున్నాయి.

Tags:    

Similar News