ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ వరాలు

ప్రభుత్వ ఉద్యోగులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరాలజల్లు కురిపించారు. సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… తాము [more]

Update: 2019-03-25 07:29 GMT

ప్రభుత్వ ఉద్యోగులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వరాలజల్లు కురిపించారు. సోమవారం కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ… తాము అధికారంలోకి వచ్చిన తక్షణమే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇస్తామని, సకాలంలో పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల విద్యార్హత, సర్వీస్ ను బట్టి రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పని, సమాన వేతనం విధానం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటుచేస్తామన్నారు. పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఇస్తామని, హోంగార్డులకు మెరుగైన వేతనం అందిస్తామన్నారు. అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులకు అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. ఆదోని సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Tags:    

Similar News