సెలవుల్లేవ్… సీటీలు చింపేయండి

ఏసీబీ పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ సమీక్షించారు. ఏసీబీ పనితీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఏసీబీలో [more]

Update: 2020-01-02 08:16 GMT

ఏసీబీ పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ సమీక్షించారు. ఏసీబీ పనితీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ పనితీరు ఆశించిన స్థాయిలో లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా, అంకిత భావంతో పనిచేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదన్నారు. అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్‌ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని సీఎం చెప్పారు. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలన్నారు.

సెలవుల్లేకుండా….

ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని సీఎం జగన్ కోరారు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు జగన్. ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసుల్లో ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదని చెప్పారు. లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని జగన్ కోరారు. సెలవు ల్లేకుండా పనిచేయమని కోరారు. మూడు నెలల్లోగా తనకు మార్పు కనిపించాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు. కావాల్సినంత సిబ్బందిని తీసుకోవాలని, ఎలాంటి సదుపాయాలు కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని జగన్ చెప్పారు.

Tags:    

Similar News