బాబును ఆరోజే తప్పుపట్టా

చంద్రబాబు తీరును యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని చెప్పారు. ఆరోజు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో [more]

Update: 2020-01-13 07:35 GMT

చంద్రబాబు తీరును యనమల రామకృష్ణుడు తప్పుపట్టారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఫిరాయింపులకు తాను వ్యతిరేకమని చెప్పారు. ఆరోజు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకున్నప్పుడు తాను అభ్యంతరం చెప్పానన్నారు. అలాగే ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కూడా తాను అభ్యంతరం చెప్పానని యనమల రామకృష్ణుడు చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ నాయకుడు ఎవరన్న ప్రశ్నకు ఎవరు బాగా నాయకత్వం వహిస్తే వారే నాయకుడవుతారన్నారు. లోకేష్ ఇంకా నాయకుడిగా తయారు కాలేదని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. జగన్, విజయసాయిరెడ్డిలు జైలుకు వెళ్లడం ఖాయమని, వారు కేసుల నుంచి తప్పించుకోలేరన్నారు. వారిపై మనీ ల్యాండరింగ్, ఫెమా కేసులు నమోదవ్వడం వల్ల జైలుకు జగన్ వెళ్లడం ఖాయమని తెలిపారు.

Tags:    

Similar News