కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సీబీఐ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ప్రతి శుక్రవారం జగన్ ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కోర్టులో విచారణ కోసం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన ఈరోజు సాయంత్రం తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు జగన్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు.