కాంగ్రెస్‌ అభ్యర్థుల లిస్ట్‌ విడుదల కానుందా? క్లారిటీ ఇచ్చిన 'భట్టి'

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఇక అధికార పార్టీ అయిన బీఆర్ఎస్‌ నిన్న..

Update: 2023-08-22 04:50 GMT

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ఇక అధికార పార్టీ అయిన బీఆర్ఎస్‌ నిన్న అసెంబ్లీఎ న్నికల్లో బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు పార్టీ అధినేత కేసీఆర్‌. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి రేసు గుర్రాలు ఎవరో తేలిపోయింది. ఇక మిగితా పార్టీల అభ్యర్థుల లిస్ట్‌ రావాల్సి ఉంది. ఇప్పుడు కమలం పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే వరకు ఇతర పార్టీలు ఆగుతాయా..? లేక ప్రకటిస్తాయన్నది తేలాలి.

ఇక బీజేపీ సంగతేమోగానీ.. కాంగ్రెస్‌ జాబితా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇచ్చేశారు భట్టివిక్రమార్క.. తెలంగాణ ఎన్నికల కోసం తమ రేగు గుర్రాలను ప్రకటించింది బీఆర్‌ఎస్. ఒకేసారి 115మంది అభ్యర్ధులను ప్రకటించారు కేసీఆర్‌. ఇక అధికార పార్టీ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి..మరి ఇతర పార్టీల అభ్యర్థుల పేర్లు ఎప్పుడు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు ఆయా పార్టీల నేతలు. బీఆర్‌ఎస్‌కి పోటీగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారా..?అంటే ఇప్పుడెందుకు తొందర అంటున్నారు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క. కేసీఆర్‌ హడావుడి చూస్తుంటే కోయిల ముందే కూసినట్టుగా ఉందంటూ సెటైర్లేశారు భట్టి. తమ అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని అంటున్నారు భట్టి విక్రమార్క. ఎన్నికల షెడ్యూల్‌ తర్వాతో లేక నోటిఫికేషన్‌ వచ్చాకో లిస్ట్‌ ఉండొచ్చంటూ సంకేతాలిచ్చారు భట్టి.

ఇప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల లిస్ట్‌ వెల్లడి కావడంతో రాజకీయాల్లో హడావుడి నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీలో టికెట్స్‌ కోల్పోయిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్‌ దక్కని వారు హస్తం వైపు చూస్తున్నారు. కొందరు త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న వారు తమ కార్యచణను సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తమతమ అనుచరులతో భేటీ అవుతున్నారు. ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఖానాపూర్‌ నియోజకవర్గంలో రేఖానాయక్‌కు టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానంటూ మీడియాతో తెలిపారు. అనుచరుల సమాచారం మేరకు రేఖానాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టికెట్స్‌ కోల్పోయిన అభ్యర్థులు కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి వారు ఇతర పార్టీలోకి వెళ్తారా..? లేక కేసీఆర్‌ మాటలకు కట్టుబడి ఉండి బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా..? లేదా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News