చిరంజీవి ఆ రిస్క్‌ చేస్తారా?

భోళా శంకర్‌ ఫ్లాప్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ సినిమాలు అంటే భయపడుతున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాల్లో చాలావరకూ రీమేక్‌లే. అప్పట్లో ఓటీటీలు లేకపోవడం, సినిమాల జడ్స్‌మెంట్‌ బాగుండటం, చిరంజీవి వయసులో ఉండటంతో అవి మెగాస్టార్‌ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఏ భాషలో సినిమానైనా టీవీల్లో చూసేస్తున్నారు. ఓటీటీల పుణ్యమిది. సినిమా బాగుందని రీమేక్‌ చేసినా జనం ఒరిజినల్స్‌తో పోలుస్తున్నారు. ఇది పెద్ద హీరోలకు మైనస్‌ అవుతోంది.

Update: 2024-01-02 12:31 GMT

Will chiranjeevi remake Lucifer part 2?

భోళా శంకర్‌ ఫ్లాప్‌ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ సినిమాలు అంటే భయపడుతున్నారు. గతంలో ఆయన నటించిన సినిమాల్లో చాలావరకూ రీమేక్‌లే. అప్పట్లో ఓటీటీలు లేకపోవడం, సినిమాల జడ్స్‌మెంట్‌ బాగుండటం, చిరంజీవి వయసులో ఉండటంతో అవి మెగాస్టార్‌ కెరీర్‌కు ఎంతో ఉపయోగపడ్డాయి. కానీ ఏ భాషలో సినిమానైనా టీవీల్లో చూసేస్తున్నారు. ఓటీటీల పుణ్యమిది. సినిమా బాగుందని రీమేక్‌ చేసినా జనం ఒరిజినల్స్‌తో పోలుస్తున్నారు. ఇది పెద్ద హీరోలకు మైనస్‌ అవుతోంది. ఇటీవల చిరు రెండు రీమేక్‌లు చేశారు. గాడ్‌ఫాదర్‌, భోళాశంకర్‌. గాడ్‌ఫాదర్‌ సోసోగా ఆడితే, భోళాశంకర్‌ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను అవుట్‌డేటెడ్‌ అనుకున్నా... లూసిఫర్‌లో ఉన్న ఎమోషన్స్‌, డ్రామా గాడ్‌ఫాదర్‌లో కనిపించలేదు.

ఈ నేపథ్యంలో మళయాళంలో లూసిఫర్‌ పార్ట్‌ 2ని తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్‌దే లీడ్‌ రోల్‌. దీనిని కూడా చిరంజీవి రీమేక్‌ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ఓ సీక్కెల్‌ తీసి ఆయన చేయి కాల్చుకున్నారు. మున్నాబాయ్‌ ఎంబీబీఎస్‌ను శంకర్‌దాదాగా రీమేక్‌ చేస్తే తెలుగులో సూపర్‌ హిట్‌ అయింది. తర్వాత లగేరహో మున్నాబాయ్‌ అంటూ పార్ట్‌2 తీశారు. అదీ సూపర్‌హిట్‌. వెంటనే తెలుగులో శంకర్‌దాదా జిందాబాద్‌ అన్నారు. అది పరాజయం పాలైంది.

భోళాశంకర్‌ ఫ్లాప్‌తో చిరంజీవికి రీమేక్‌ల మీద విరక్తి కలిగింది. అందుకే మరో మళయాళ సూపర్‌ హిట్‌ బ్రో డాడీ రీమేక్‌ను ఆయన విరమించుకున్నారు. డైరెక్ట్‌ హిట్‌ వాల్తేరు వీరయ్యలాంటి వాటిమీదే మనసు పడుతున్నారు. మరో భారీ హిట్‌తో అభిమానులను అలరించడానికి సిద్ధపడుతున్నారు. లూసిఫర్‌ 2 విడుదలైతే గానీ చిరంజీవి ఎటూ తేల్చుకోకపోవచ్చు.

Tags:    

Similar News