ఇది హత్యా..? ఆత్మహత్యా..?

అనుకున్నట్లే తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్‌ వాదుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. భాజపా శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఏడాది కిందటి వరకూ తెలంగాణలో అధికారాన్ని సాధిస్తామని గొప్పలు పోయిన కమలం పార్టీ... కేవలం పది స్థానాలతో సంతృప్తి పడే స్థాయికి ఎందుకు దిగజారింది?

Update: 2023-12-03 04:31 GMT

అనుకున్నట్లే తెలంగాణ ఫలితాలు కాంగ్రెస్‌ వాదుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి. భాజపా శ్రేణులు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయాయి. ఏడాది కిందటి వరకూ తెలంగాణలో అధికారాన్ని సాధిస్తామని గొప్పలు పోయిన కమలం పార్టీ... కేవలం పది స్థానాలతో సంతృప్తి పడే స్థాయికి ఎందుకు దిగజారింది?

తెలంగాణ ‘కమలం’లోకి బండి సంజయ్‌ రానంత వరకూ ఓ లెక్క. ఆయన వచ్చిన తర్వాత మరో లెక్క.. అన్నట్లు ఉండేది తెలంగాణలో భాజపా పరిస్థితి. ఆయన పార్టీలో నూతన ఉత్తేజాన్ని తీసుకువచ్చారు. దక్షిణాదిలో మరో రాష్ట్రాన్ని కమలం ఖాతాలో చేర్చే స్థాయికి... ఆయన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు. కానీ ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు బండి సంజయ్‌ను భాజపా అధిష్టానం కీలక బాధ్యతల నుంచి తప్పించింది. తద్వారా తెలంగాణలో గెలవాలన్న తన ఆశలకు తానే స్వయంగా గండి కొట్టుకుంది.

వివాద రహితుడు అయిన కిషన్‌రెడ్డికు సంజయ్‌ అంత దూకుడు లేదు. ప్రస్తుత రాజకీయాల్లో సున్నితత్వం పనికిరాదు. నిజంగా బండి సంజయ్‌ నేతృత్వంలో తెలంగాణ భాజపా ఎన్నికలకు వెళ్లి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి. మరి ఈ ‘వ్యూహాత్మక’ తప్పిదం వెనుక ఉన్నదెవరు? తెలంగాణలో పార్టీ అవకాశాలను చేజేతులా చేజార్చుకున్నదెవరు? కార్యకర్తల మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు?

Tags:    

Similar News