యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లు లేదు

రష్యా, - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త ఏడాది కూడా రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ తో విరుచుకుపడింది

Update: 2023-01-02 04:58 GMT

పది నెలల నుంచి యుద్ధం. ఎందరో మృత్యువాత పడ్డారు. కోట్ల ఆస్తుల నష్టం జరిగింది. అయినా రెండు దేశాల సైన్యం తెగించి పోరాడుతున్నాయి. వేల సంఖ్యలో ఇరు దేశాల సైనికులు మృత్యువాత పడ్డారు. ఆర్థికంగా నష్టం జరిగింది. అయినా ఎవరూ తగ్గడం లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు. రష్యా, - ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త ఏడాది కూడా రష్యా మిస్సైళ్లతో ఉక్రెయిన్ తో విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్ లో పెద్దయెత్తున నష్టం జరిగింది. మిసైళ్లతోదాడులు చేస్తుంది.

కీవ్ నగరాన్ని...
ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని రష్యా టార్గెట్ చేసింది. గత పది నెలలుగా అతి పెద్ద దేశం రష్యా యుద్ధం చేస్తున్నా ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోలేకపోయింది. ఉక్రెయిన్ సేనలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాయి. పౌరులు ఇప్పటికే అనేక మంది ఇతర దేశాలకు తరలి వెళ్లారు. పౌరులు ఎవరూ బయటకు రావద్దంటూ ఉక్రెయిన్ ప్రభుత్వం హెచ్చరించింది. వైమానిక దాడులు జరుగుతున్నాయని, ఎయిర్ అలర్ట్ ఆన్ లో ఉందని ప్రభుత్వం ప్రకటించింది.

హోరాహోరీ...
రెండు దేశాల సైనికులు హోరాహోరీ పోరాడుతున్నాయి. చర్యలకు సిద్ధమని రష్యా ప్రకటిస్తున్నప్పటికీ, తాము ఇక చర్చించేదేమీ లేదంటూ ఉక్రెయిన్ చెబుతోంది. వైమానిక దాడులను ఉక్రెయిన్ సేనలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి. సైనికులు మరణిస్తున్నా పట్టణంపై పట్టు జారిపోకుండా ఉక్రెయిన్ సేనలు రష్యాతో పోరాడుతున్నాయి. తాము గెలిచే వరకూ పోరాడుతూనే ఉంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. మొత్తం మీద రెండు దేశాల మధ్య యుద్ధం ఇంకా ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. పౌరులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు.


Tags:    

Similar News