విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Update: 2018-06-19 12:45 GMT

ప్రధానమంత్రిని చంద్రబాబు నాయుడు కలవడంపై విమర్శలు చేయడం తగదని, ప్రతిపక్షం పనిలేక ఇటువంటి విమర్శలు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...సొంత పార్టీపైనా విమర్శలు చేశారు. చంద్రబాబు ఇక్కడ పులిలా ఉంటారని, ఢిల్లీలో పిల్లిలా ఉంటారని స్వంత పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుపట్టారు. ప్రతిపక్ష నేతలుగా మేము ముఖ్యమంత్రిని కలిసినా తప్పులేదన్నారు. దీంతో పాటు గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినందునే టీడీపీ అధికారంలో ఉందని, అదే విధంగా బీజేపీకి నాలుగు సీట్లు వచ్చాయని ఆయన అంగీకరించారు.

Similar News