బ్రేకింగ్ : ఊహించిందే….కిరాతకుడు హతమయ్యాడు…

గ్యాంగస్టర్ వికాస్ దుబే ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. నిన్న వికాస్ దుబే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఆలయంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే వికాస్ [more]

Update: 2020-07-10 02:51 GMT

గ్యాంగస్టర్ వికాస్ దుబే ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. నిన్న వికాస్ దుబే మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ఆలయంలో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే వికాస్ దుబేను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ప్రత్యేక వాహనంలో కాన్పూర్ తరలిస్తుండగా ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఇదే అదనుగా వికాస్ దుబే తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో తప్పించుకుపోతున్న వికాస్ దుబే పై పోలీసులు కాల్పులు జరిపారు. వికాస్ దుబే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో 8 మంది పోలీసుల మృతికి కారణమైన వికాస్ దుబే చివరకుపోలీసుల చేతిలో హతమయ్యాడు.

Tags:    

Similar News