Cyber Crime: వదలకుండా వెంట పడుతున్న సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరగాళ్లు వదలకుండా వెంట పడుతున్నారు
సైబర్ నేరగాళ్లు వదలకుండా వెంట పడుతున్నారు. వారి మాయలో పడి కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. ఎన్ని ప్రచారాలు చేసినా, తెలియని మెసేజ్ లకు, తెలియని ఫోన్ నెంబర్లకు స్పందించ వద్దని ఇటు పోలీసులు, అటు ప్రభుత్వం పదే పదే చెబుతున్నప్పటికీ ఎవరూ వినడం లేదు. కోట్ల రూపాయలు సమర్పించుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఒక మహిళ పారిశ్రామిక వేత్త సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. 1.20 కోట్లను అర్పించుకున్నారు.
మాజీ డీజీపీ మనవరాలికి...
మాజీ డీజీపీ మనవరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా వేశారు. హైదరాబాద్‌లో మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఈ నెల 13న ఆమె పేరుతో ఉన్న వాట్సప్ ఖాతా నుంచి ఆమె అకౌంటెంట్‌కు మెసేజ్ వచ్చి, రూ.1.20 కోట్లు పంపాలని ఒక మెసేజ్ వచ్చింది. తాను అర్జంట్ మీటింగ్ లో ఉన్నానని వెంటనే డబ్బులు పంపాలని అత్యవసమరమని డబ్బులు పంపాలని కోరగా అకౌంటెంట్ ఆమె సూచించిన ఖాతాకు డబ్బులు పంపారు.
మరోసారి డబ్బులు పంపాలంటూ...
అకౌంటెంట్ డబ్బు పంపిన తర్వాత, ఈ నెల 17న మరోసారి డబ్బు పంపాలంటూ మెసేజ్ వచ్చింది. అప్రూవల్ కోసం సంప్రదించగా, ఆమె తాను ఎవరికీ డబ్బు పంపాలని అడగలేదని స్పష్టం చేశారు. దీంతో బాధితులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరసగా కోట్ల రూపాయలు డబ్బులు పంపేటప్పుడు ఒకసారి ఆలోచించుకుని పంపితే బాగుంటుంది. అంతే తప్ప.. తమ యజమాని అని పంపితే ఇలాగే అవుతుందని, సైబర్ నేరగాళ్లు ఏ రూపంలోనైనా రావచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. మెసేజ్ లు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పెద్దమొత్తంలో డబ్బులు పంపాలని చెబుతున్నారు.