బెజవాడలో కేసీఆర్....!

Update: 2018-06-28 06:56 GMT

బెజవాడ దుర్గమ్మ దర్శనానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. కేసీఆర్ వెంట నాయిని నర్సింహారెడ్డి, కేకే, ఇంద్రకరణ్ రెడ్డి, బాల్క సుమన్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఎయిర్ పోర్టు నుంచి విజయవాడలోని ఓ హోటల్ కి వెళ్లి అక్కడి నుంచి ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించి మొక్కు చెల్లించుకోని తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా విజయవాడలో ఏపీకి చెందిన కేసీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. కొండపై కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కట్టారు. కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అయితే, దైవసన్నిధిలో రాజకీయ ఫ్లెక్సీలు పెట్టడం, నినాదాలు చేయడం సరికాదని వారిని దేవాలయ సిబ్బంది వారించారు.

Similar News