ఎన్టీఆర్ గారూ మీ అల్లుడు అరాచకాలు చూడండి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. మద్యం షాపులను కూడా చంద్రబాబు రాజకీయానికి [more]

Update: 2020-05-06 06:39 GMT

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. ఆయన ట్విట్టర్ లో చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. మద్యం షాపులను కూడా చంద్రబాబు రాజకీయానికి వాడుకుంటున్నారన్నారు. ఎన్టీఆర్ మద్యనిషేధం విధిస్తే దానికి తూట్లు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను కూడా అలాగే చేజిక్కించుకున్నారన్నారు. హుద్ హుద్ తుఫాను సందర్భంగా విరాళలు సేకరించి వంద కోట్లను ఎన్టీఆర్ ట్రస్ట్ లోకి చంద్రబాబు తీసుకెళ్లారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ గారూ మీ అల్లుడి అరాచకాలను చూడండి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News