విజయ్ పేరుతో నకిలీ ఫేస్ బుక్…..అమ్మాయిలకు వలవేసి?

యువకులు అమ్మాయిలను మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో హీరోల పేరుతో అకౌంట్ క్రియేట్ చేసే అమ్మాయిలు ఈజీగా [more]

Update: 2020-03-04 11:30 GMT

యువకులు అమ్మాయిలను మోసం చేయడానికి కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి ఫేస్ బుక్ లో హీరోల పేరుతో అకౌంట్ క్రియేట్ చేసే అమ్మాయిలు ఈజీగా వలలో పడతారని ఆలోచించాడు. హీరో పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న సైబర్ కేటుగాడు. హీరో దేవరకొండ పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేస్తే అమ్మాయిలు ఈజీగా పడిపోతారని ఆలోచించాడు. వెంటనే హీరో విజయ్ దేవరకొండ పేరుతో నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేశాడు దీంతో అమ్మాయిలను ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న హీరో విజయ్ దేవరకొండ వెంటనే తన మేనేజర్ తో కలిసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాడిని పట్టుకోవడానికి రెండు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News