నారాయణ రాణేకు బెయిల్ మంజూరు
కేంద్ర మంత్రి నారాయణ రాణే కు బెయిల్ లభించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో నారాయణ [more]
కేంద్ర మంత్రి నారాయణ రాణే కు బెయిల్ లభించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో నారాయణ [more]
కేంద్ర మంత్రి నారాయణ రాణే కు బెయిల్ లభించింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో నారాయణ రాణే మహద్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నారాయణ రాణేను నాలుగు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే నారాయణ రాణే తరుపున న్యాయవాదులు మాత్రం ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో నారాయణ రాణేకు పదిహేను వేలు పూచికత్తుతో బెయిల్ మంజూరయింది. అయితే ఈ నెల 30, సెప్టంబరు 13న మహద్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది.