షర్మిల హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తీవ్ర ఉద్రిక్తత

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లోటప్‌ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద

Update: 2023-08-18 05:01 GMT

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో లోటప్‌ పాండ్‌లోని ఆమె నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. ఆమె బయటకు రాకుండా హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. అయితే దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని షర్మిల గజ్వేల్‌ కు బయలుదేరనున్ననేపథ్యంలో పోలీసులు అడ్డుకుని హౌస్‌ అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఆమె ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అయితే షర్మిల గజ్వేల్‌ వెళ్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ముందస్తుగానే ఈ రోజు ఉదయం ఆమె నివాసానికి చేరుకున్నారు. ముందస్తుగా ఆమెను హౌస్‌ అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. అక్కడ కొంత సేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

ఈ రోజు ఇక్కడే నిరహార దీక్ష చేస్తా..

దళిత బంధు పథకంలో అక్రమాలు జరిగాయని గజ్వేల్‌ పర్యటనకు వెళ్తున్నానని, అక్కడి వారిలో మాట్లాడేందుకు వెళ్తున్నానని, ఎలాంటి అలర్లు గానీ, గొడవలు చేయబోమని, శాంతియుతంగానే ఉంటామని చెప్పినా పోలీసులు వినకపోవడంతో ఆమె పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో ఇందుకు నిరసనగా, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడే నిరసన తెలుపుతానని షర్మిల స్పష్టం చేశారు.ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో అక్రమాలు పెరుగుతున్నాయని, దళిత బంధు పథకంలో జరిగిన అక్రమాలపై తాను గజ్వేల్‌ వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీరుకు నిదర్శనమన్నారు. తమపై బీఆర్‌ఎస్‌ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, ఎవరు కర్రలతో కొట్టినా, మా వాహనాలు ధ్వంసం చేసినా, తమ ప్రాణాలు తీసినా తాము స్పందించమని, వారు ఏదైనా చేసుకోనివ్వండని అన్నారు. తమపై దాడులకు పాల్పడినా ఏ మాత్రం స్పందించమన్నారు. తాను శాంతియుతంగానే గజ్వేల్‌కు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమని, ఇందుకు నిరసనగా తన నివాసం వద్దే నిరహారం దీక్షకు దిగుతానని, నా దీక్ష ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటికే తమపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎన్నో దాడులకు పాల్పడ్డారని, ఇవన్ని చూసే వచ్చామని, అలాంటి దాడులకు, దెబ్బలకు, పోలీసుల తీరుకు భయపడేది లేదని షర్మిల స్పష్టం చేశారు. పోలీసు, కేసీఆర్‌ ప్రభుత్వం తీరుపై ఆమె నిరసన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News