రవిప్రకాశ్‌‌కు ముందస్తు బెయిలు మంజూరు

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. [more]

Update: 2020-07-17 12:33 GMT

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈడి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో రవిప్రకాష్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు శుక్రవారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. టీవీ9 బోర్డు అనుమతి లేకుండా నిధులను వాడుకున్నారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ద తో పాటుగా సైబరాబాద్ లో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ రవి ప్రకాష్ పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఈ కేసులోని రవి ప్రకాష్ బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇదే కేసులో ఇప్పుడు ఈడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే రవిప్రకాశ్‌ విత్‌ డ్రా చేసిన 18 కోట్ల రూపాయలను ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ ఆరా తీయనుంది. కంపెనీలో ఎక్కువ షేర్లు ఉన్న డైరెక్టర్లను సంప్రదించకుండా, ఎలాంటి బోర్డు మీటింగ్ పెట్టకుండా 18 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసిన కేసులో ఏ-1గా రవిప్రకాశ్ ఉన్నారు.

Tags:    

Similar News