Andhara Prasesh : లబ్దిదారులకు అదిరిపోయే న్యూస్.. ఈ రోజే వారి బ్యాంకు ఖాతాల్లో

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పథకాల విషయంలో విస్పష్టమైన తీర్పు చెప్పింది

Update: 2024-05-10 02:47 GMT

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జగన్ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పథకాల విషయంలో విస్పష్టమైన తీర్పు చెప్పింది. డీబీటీ పద్ధతిలో లబ్దిదారుల ఖాతాల్లో నేడు ఒక్కరోజే నగదును జమ చేసేందుకు హైకోర్టు అంగీకరించింది. ఎన్నికల కమిషన్ నిర్ణయం పై హైకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఈరోజు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో నిధులు విడుదల చేయాలని కోరింది. ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకూ ఎలాంటి నిధులను విడుదల చేయవద్దని, ఎన్నికల సమయంలో మాత్రం నిధులను విడుదల చేయవద్దని పేర్కొంది.

నగదు బదిలీని...
సంక్షేమ పథకాల నగదు బదిలీని ఆపాలంటూ ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. అయితే ఈ నగదు బదిలీ జరిగిన తర్వాత నేతల జోక్యం ఉండకూడదని, ప్రచారం చేసుకోకూడదని, ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని కూడా చెప్పింది. నేడు లబ్ది దారుల ఖాతాల్లో ఈబీసీ నేస్తం, రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ, విద్యా దీవెన, చేయూత నిధులను ఈ ఒక్కరోజు మాత్రమే విడుదల చేయడానికి ఆదేశాలు జారి చేసింది. దీనిపై తదుపరి తీర్పును జూన్ 27వ తేదీకి వాయిదా వేసింది.


Tags:    

Similar News