కేసీఆర్ ట్రాప్ లో పడిపోయారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ తాను అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నట్లే కనిపిస్తుంది. ఆయన వేసిన వ్యూహం వర్క్ అవుట్ అవుతుంది.

Update: 2022-02-10 04:59 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నట్లే కనిపిస్తుంది. ఆయన వేసిన వ్యూహం వర్క్ అవుట్ అవుతుంది. నేరుగా మోదీని ఢీకొన్న కేసీఆర్ వచ్చే ఎన్నికలకు పొలిటికల్ గ్రౌండ్ ను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. బీజేపీ కూడా కేసీఆర్ ట్రాప్ లో పడిపోయినట్లే కనిపిస్తుంది. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ అందిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఈ సమయంలోనే కేసీఆర్ మోదీ హైదరాబాద్ పర్యటనకు దూరంగా ఉండి ఆ టాపిక్ ను డైవర్ట్ సక్సెస్ ఫుల్ గా చేశారు.

తనకు అనుకూలంగా....
మోదీ రాష్ట్ర విభజన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. మోదీకి వ్యతిరేరకంగా జాతీయ స్థాయిలో బలంగా ఎదిగేందుకు కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ పార్టీల నేతలను ఆయన కలుపుకుని పోయే ప్రయత్నం చేశారు. అనేకమంది నేతలను కలిసి తనతో కలసి రావాల్సిందిగా అభ్యర్థించి వచ్చారు కూడా.
తెలంగాణకు వ్యతిరేకమని...
కానీ మోదీ తెలంగాణకు పూర్తిగా వ్యతిరేకమని రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పడంలో టీఆర్ఎస్ వంద శాతం సక్సెస్ అయింది. రాష్ట్ర విభజనలో ఏపీకి అన్యాయం జరిగిందని మోదీ చెప్పడాన్ని తనకు అనుకూలంగా కేసీఆర్ మలచుకున్నారు. మోదీ ఫ్రస్టేషన్ కు లోనవ్వడం కేసీఆర్ కు కావాల్సింది. అదే జరిగింది. ఇప్పుడు బీజేపీ నేతలు ఎన్ని చెప్పుకున్నా తెలంగాణ ప్రజలను మోదీ అవమానించారన్న టీఆర్ఎస్ కౌంటర్ కు వారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అదే తనకు లాభిస్తుందని...
బీజేపీతో కయ్యమే తనకు రాజకీయంగా లాభిస్తుందని కేసీఆర్ అంచనా వేశారు. అందుకే ఆయన పర్యటనకు దూరంగా ఉండటమే కాకుండా ట్విట్టర్ లో టీఆర్ఎస్ యుద్ధమే ప్రకటించింది. మోదీకి వ్యతిరేకంగా కేసీఆర్ కు యాంటీ గా ఉన్న కోదండరామ్ సయితం బీజేపీని తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ దూకుడుకు కేసీఆర్ కొంత చెక్ పెట్టారనే చెప్పాలి. ఈపోరులో రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను పూర్తిగా పక్కన పెట్టగలిగారు. ఎటు రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు దాటుతున్నా మోదీ రాజేసిన అగ్గిని కేసీఆర్ తనకు అనుకూలంగా మలచుకున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండటంతో కేసీఆర్ బీజేపీపై మరింత స్పీడ్ ను పెంచి తన స్థానాన్ని సుస్థిరపర్చుకునే ఛాన్స్ కన్పిస్తుంది.


Tags:    

Similar News