విజయం మనదే.. భవిష్యత్ అందరిదీ

ఖమ్మం సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

Update: 2023-01-18 12:13 GMT

ఖమ్మం సభ దేశంలో ప్రబలమైన మార్పునకు సంకేతమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. లక్షల కోట్ల ఆస్తి మన దేశ ప్రజల సొత్తు అని అన్నారు. ఖమ్మం బహిరంగ సభలో కేసీఆర్ మట్లాడారు. ఆహార ఉత్పత్తిలో ముందుండాల్సిన ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే ఖర్మ ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. నీరు పుష్కలంగా ఉన్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదన్నారు. 70 వేల టీఎంసీల నీరు నికరంగా ఉంటే 19 వేల టీఎంసీల నీటిని మాత్రమే వాడుకుంటుందన్నారు. ఒక లక్ష్యం లేకుండా భారత్ కొన్ని దశాబ్దాలుగా పయనిస్తుందన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలను...
మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేస్తుందన్నారు. అద్భుతమైన పంటలు పండే దేశాన్ని నాశనం చేస్తున్నారన్నారు. మోదీ ప్రభుత్వం ఏ ప్రభుత్వ రంగ సంస్థను ప్రయివేటు పరం చేసినా తాము అధికారంలోకి రాగానే తిరిగి జాతీయీకరణ చేస్తామన్నారు. దేశం మొత్తం దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. ఎల్ఐసీ ఉద్యోగులు సింహాల్లా గర్జించాలని ఆయన పిలుపు నిచ్చారు. చివరకు వ్యవసాయాన్ని కూడా ప్రయివేటు పరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.

పొరుగున ఉన్న దేశాలు...
పొరుగున ఉన్న చైనా ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తుందో చూడాలన్నారు. జపాన్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవాలన్నారు. మనదేశం కూడా ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమన్నారు. మోదీ ప్రభుత్వానికి కనీసం మంచినీళ్లు, కరెంటు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దేశంలో మిషన్ భగీరథను అమలు చేస్తామన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మేకిన్ ఇండియా జోక్ ఇన్ ఇండియా అయిపోయిందని ఎద్దేవా చేశారు. అగ్నిపథ్ ను కూడా తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని తెలిపారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే....
సైనికులను పలుచనగా చూడటం తగదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లో ప్రయివేటీకరణ చేయనివ్వబోమన్నారు. మతం మత్తులో యువతను చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. చట్టసభల్లో 35 శాతం మహిళలకు రిజర్వేషన్లను అమలు చేస్తామన్నారు. అందరం ఏకమై ఈ మూర్ఖుల అసమర్థ పాలనను తరమికొట్టాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ విధానాలను ప్రజల ముందు పెడతామని కేసీఆర్ తెలిపారు. సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలతో దేశ వ్యాప్తంగా బీఆర్ఎస పనిచేస్తుందన్నారు. చివరకు విజయం మనదే నని ఆయన అన్నారు.


Tags:    

Similar News