కుప్పంపై ఏమి తేలుస్తారో? వారిపై వేటు వేస్తారా?

టీడీపీఅధినేత చంద్రబాబు నేడు కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. దీనిపై పార్టీలో ఆసక్తి నెలకొంది.

Update: 2021-12-08 01:57 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేయనున్నారు. దీనిపై పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు గత కొద్ది రోజులుగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా నేతలకు క్లాస్ పీకుతున్నారు. పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించడం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారంలో లోపాలు వంటివి చంద్రబాబు ఈ సమీక్షల్లో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు.

బాబు, చినబాబు....
ఇక కుప్పం విషయానికొస్తే అక్కడ చంద్రబాబు సమక్షంలోనే అభ్యర్థుల ఎంపిక జరిగింది. రెండు రోజుల పాటు చంద్రబాబు అక్కడే మకాం వేసి ప్రచారంలో పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా కుప్పం ఎన్నికల ప్రచారంలో రెండు రోజులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కుప్పం ఎన్నికల ఫలితాల సమీక్షపై చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది ఆసక్తికరంంగా మారింది.
నివేదికలో....
అక్కడ ఇన్ ఛార్జులుగా పనిచేసిన అమర్ నాధ్ రెడ్డి, నిమ్మల రామానాయుడుల చేత చంద్రబాబు ఇప్టటికే నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది. అక్కడ చంద్రబాబు పీఏగా ఉన్న మనోహర్ తో పాటు మరో నేత వల్లనే ఓటమి ఎదురయిందని నివేదికలో తెలిపినట్లు సమాచారం. మరి ఈ సమీక్షలో చంద్రబాబు కుప్పంలో తనకు ఇన్నాళ్లు వెంట ఉన్న వారిపై వేటు వేస్తారా? లేదా? వారికి కూడా క్లాసులతో సరిపెడతారా? అన్నది చూడాల్సి ఉంది. నేడు రాజంపేట మున్సిపల్ ఎన్నికల ఫలితంపై కూడా సమీక్ష చేయనున్నారు.


Tags:    

Similar News