రతన్ టాటా.. నిజంగా రత్నమేగా

కరోనా ను దేశం నుంచి తరిమికొట్టేందుకు టాటా ట్రస్ట్ విరాళాన్ని ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం 500 కోట్ల రూపాయలను విరాళాన్ని ఇస్తున్నట్లు టాటా ట్రస్ట్ ప్రకటించింది. [more]

Update: 2020-03-28 12:57 GMT

కరోనా ను దేశం నుంచి తరిమికొట్టేందుకు టాటా ట్రస్ట్ విరాళాన్ని ప్రకటించింది. కరోనా నియంత్రణ కోసం 500 కోట్ల రూపాయలను విరాళాన్ని ఇస్తున్నట్లు టాటా ట్రస్ట్ ప్రకటించింది. టాటా ట్రస్ట్ ఛైర్మన్ రతన్ టాటా ఈ ప్రకటన చేశారు. కరోనాతో కోట్లాది మంది పేదలు రోడ్డున పడ్డారని, దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని రతన్ టాటా ఆవేదన చెందారు. అందరూ స్వీయ నిర్భంధాన్ని పాటించి కరోనాను తరిమేద్దామని రతన్ టాటా పిలుపునిచ్చారు. వైద్య పరికరాలు, మాస్క్ లు, టెస్టింగ్ కిట్ల కోసం మాత్రమే కాకుండా బాధితుల కోసం కూడా ఈ సొమ్మును వినియోగిస్తామని చెప్పారు.

Tags:    

Similar News