ప్రభుత్వ పాఠశాల నుంచి బదిలీ అయిన ఓ ఉపాద్యాయుడు వెళుతుండగా విద్యార్థులంతా వెళ్లొద్దంటూ ఎడ్చిన ఫోటోలు, వీడియో ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. తమిళనాడు తిరువళ్లూరుకు సమీపంలోని వలైగరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు మాధవన్ ను సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ చేశారు. దీంతో ఆయనను వెళ్లవద్దంటూ ఆ పాఠశాల విద్యార్థులు ఏడుస్తూ, ఎంతో ప్రేమ చూపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అక్కడి ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఆయన అదే పాఠశాలోనే ఉంటే బాగుంటుందని భావించి బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే, ఈ ఉపాధ్యాయుడు మాధవన్ తెలుగు వ్యక్తే. ఆయనది చిత్తూరు జిల్లాకు సమీపంలోని గ్రామానికి చెందిన చేనేత కుటుంబం.