బ్రేకింగ్ : ఆధార్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు

Update: 2018-09-26 06:39 GMT

ఆధార్ కార్డుకు రాజ్యాంగబద్ధతపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. వ్యక్తిగత స్వచ్ఛకు ఆధార్ అవరోధం కాదని తేల్చిచెప్పింది. ఆధార్ రాజ్యాంగబద్ధం కాదని వేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆధార్ ఫార్ములాతో సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏకీభవించింది. మిగతా గుర్తింపు కార్డులతో తోలిస్తే ఆధార్ కార్డు విశిష్ఠమైనదని, ఇది అట్టడుగు వర్గాల వారికి సాధికారత కల్పించిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఆధార్ నకిలీది తయారుచేసే అవకాశం లేదని తేల్చి చెప్పింది. ప్రజాప్రయోజనాల కోసమే ఆధార్ సేవలని, ఆధార్ సేకరించేది చాలా తక్కువ వ్యక్తిగత సమాచారం మాత్రమేనని పేర్కింది.

ప్రైవేటు సంస్థలకు ఇవ్వవద్దు...

అయితే, ఆధార్ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, ప్రభుత్వ సంస్థలు ఆధార్ డేటా షేర్ చేసుకోవచ్చని, కానీ, అలా తీసుకున్న డేటాను ఆరు నెలల్లో తొలగించాలని చెప్పింది. ప్రైవేట్ సంస్థలకు ఆధార్ వివరాలు ఇవ్వకూడదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక బ్యాంకులకు ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదని, టెలీకాం కంపెనీలు ఆధార్ కార్డు అడగవద్దని చెప్పింది.

Similar News