తీర్పు చెప్పిన న్యాయమూర్తికి కులం అంటగడతారా?

హైకోర్టు మీద నమ్మకం లేకనే జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు [more]

Update: 2020-03-18 12:48 GMT

హైకోర్టు మీద నమ్మకం లేకనే జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రజాధనం వృధా చేస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన న్యాయమూర్తికి కూడా కులం అంటగడతారా? అని సుజనా చౌదరి ప్రశ్నించారు. హైకోర్టు మీద కోపం తోనే కర్నూలుకు మార్చాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుందని సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ తో ప్రపంచమంతటా వణికిపోతుంటే జగన్ సర్కార్ భయపడటం లేదన్నారు. ప్రజల ప్రాణాలంటే వారికి లెక్క లేదన్నారు. ఎన్నికల కమిషనర్ కు కులాలను ఎలా అంటగడతారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై చిత్తశుద్ధి ఉంటే పది నెలల్లో ఎందుకు ఎన్నికలు పెట్టలేదని ప్రశ్నించారు.

Tags:    

Similar News