ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం..

ఒక్కక్షణం ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలంతా గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెకన్లపాటు తీవ్రమైన భూకంపం కొనసాగింది. నోయిడా..

Update: 2022-11-09 02:41 GMT

earthquake in delhi

దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. తెల్లవారుజామున 1.58 గంటలకు ఢిల్లీ సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భూ ప్రకంపనలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్కక్షణం ఏం జరుగుతుందో అర్థంకాక ప్రజలంతా గందరగోళానికి గురయ్యారు. కొన్ని సెకన్లపాటు తీవ్రమైన భూకంపం కొనసాగింది. నోయిడా, గురుగ్రామ్ లో కూడా ఈ ప్రకంపనలు కనిపించాయి. ఇళ్లలోని వస్తువులు కిందపడిపోగా.. సీలింగ్ కి ఉన్న ఫ్యాన్లు ఊగాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం లోతు సుమారు 10 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. నేపాల్ కేంద్రం తెల్లవారుజామున 1.57 నిమిషాల 24 సెకన్లకు భూకంపం వచ్చినట్లు ఎన్ సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. నేపాల్ లో ఐదు గంటల వ్యవధిలో రెండుసార్లు భూకంపం సంభవించింది. బుధవారం రాత్రి 8.52 గంటలకు 4.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. తెల్లవారుజామున సంభవించిన భూకంపం ధాటికి నేపాల్ లో ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. భూ ప్రకంపనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags:    

Similar News