తెలంగాణ హైకోర్టు క్లారిటీ

ధరణి లో భూముల రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని తాము ఎక్కడ ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. అయితే మాన్యువల్ [more]

Update: 2020-12-08 12:43 GMT

ధరణి లో భూముల రిజిస్ట్రేషన్ పై రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజిస్ట్రేషన్లు ఆపాలని తాము ఎక్కడ ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. అయితే మాన్యువల్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని హైకోర్టు తెలిపింది. ఇప్పటివరకు ధరణి వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ప్రభుత్వం ప్రారంభించింది. అయితే దీనిపై హైకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. దీనిపైన హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణ ఇవాళ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా హైకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మాన్యువల్ గా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు తెలిపింది. ఎక్కడ అ కూడా తాము రిజిస్ట్రేషన్లు ఆపాలని ఆదేశాలు ఇవ్వాలేదని పేర్కొంది. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీవోను సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అనుమతించాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. ఈ సందర్భంలోనే హైకోర్టు రిజిస్ట్రేషన్లను ఆపాలని తాము చెప్పలేదని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags:    

Similar News