గోల్ మాల్ …ఎస్బీఐ…అభిమన్యు సినిమా తరహాలో

తెలుగు, తమిళంలో సంచలనం సృష్టించిన అభిమన్యుడు సినిమా తరహాలో భారీ మోసం జరిగింది. లేని వ్యక్తులను ఉన్నట్లుగా చూపి రుణం తీసుకున్న ముఠా. హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా [more]

Update: 2020-01-03 06:08 GMT

తెలుగు, తమిళంలో సంచలనం సృష్టించిన అభిమన్యుడు సినిమా తరహాలో భారీ మోసం జరిగింది. లేని వ్యక్తులను ఉన్నట్లుగా చూపి రుణం తీసుకున్న ముఠా. హైదరాబాద్ బెంగళూరు కేంద్రంగా నడిచిన ఈ ముఠా పైన సిబిఐ కేసు నమోదు చేసింది . స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. ఈ కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన ఉన్నతాధికారులు పాత్ర కూడా బట్టబయలైంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రెయిన్ లైఫ్ ల్యాబ్ సంబంధించిన కంపెనీ పేరు మీద ఈ ముఠా 16 కోట్ల పై చిలుకు రుణం తీసుకుంది .

లేని వ్యక్తి పేరిట….

మైసూర్ చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి పేరు మీద బ్యాంకులో రుణం కోసం దరఖాస్తు చేసింది. అంతేకాకుండా బెంగళూరులో ఉన్న కొంత స్థలాన్ని సదరు వ్యక్తి పేరు మీద తనఖా పెట్టింది. వీటన్నిటిని తనిఖీ చేయకుండా ఎస్బీఐ ఉన్నతాధికారులు 16 కోట్ల రూపాయల రుణాన్ని మంజూరు చేశారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజిలెన్స్ విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాఘవేంద్ర అనే వ్యక్తి అసలు లేడని, సంబంధిత వ్యక్తికి ఆధార్ కార్డు లేవని ,అతని మీద ఎలాంటి భూమి లేదని విజిలెన్స్ విచారణలో బయట పడింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల పాత్ర పైన విజిలెన్స్ విచారణ జరిగింది . ఇందులో కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది . తప్పుడు పత్రాలతో రుణాలు మంజూరు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుల లపై వేటు పడింది . 16 కోట్ల రూపాయల రుణానికి సంబంధించి స్కాం కు పాల్పడ్డ అధికారుల పైన ప్రైవేట్ వ్యక్తుల పైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐకి ఫిర్యాదు చేసింది . ఈ ఫిర్యాదుపై సిబిఐ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.

Tags:    

Similar News