వైసీపీ జగన్ పై హత్యాయత్నం ఘటనను తెలుగుదేశం పార్టీ నేతలు వదలిపెట్టడంలేదు. జగన్ మరోసారి తీవ్ర ఆరోపణలకు దిగారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జగన్ నాటకం అట్టర్ ప్లాప్ అయిందన్నారు సోమిరెడ్డి. జగన్ పై దాడికి ఉపయోగించిన కత్తిని రెండు గంటల తర్వాత బొత్స సత్యనారాయణ మేనల్లుడు పోలీసులకు అప్పగించడమేంటని ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే జగన్ తనపై దాడి చేయించుకున్నారన్నారు. తాము జగన్ చంపాలనుకుంటే పిల్లాడ్ని ప్రయోగిస్తామా? అని ఎదురుదాడికి దిగారు. జగన్ తొలినుంచి హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ పోలీసులు, శాసనసభ పై నమ్మకం లేని జగన్ ఏపీకి సీఎం ఎలా అవ్వాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. మరోవైపు ఎంపీ కేశినేని నానికూడా జగన్ రక్తం రుచి మరిగారని తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్ నాటకం గంటల్లోనే తేలిపోయిందన్నారు. కోడికత్తితో దాడిజరిగితే బీజేపీ రాష్ట్ర నేతలు రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విభజన హామీలను పట్టించుకోని గవర్నర్ ను వైసీపీ నేతలు ఎలా కలుస్తారని ప్రశ్నించారు.