బ్రేకింగ్ : బాబుకు బిగ్ రిలీఫ్..!

Update: 2018-09-19 06:17 GMT

గోదావరి పుష్కరాల మొదటిరోజు రాజమహేంద్రవరంలో జరిగిన తొక్కిసలాట ముఖ్యమంత్రి కారణం కాదని విచారణ కమిషన్ తేల్చింది. 2015 జులై 15న జరిగిన తొక్కిసలాటలో 30 మందికి పైగా భక్తులు మరణించారు. అయితే, ముఖ్యమంత్రి వీఐపీ ఘాట్ లో కాకుండా సాధారణ భక్తుల ఘాట్ లో పుష్కరస్నానం చేయడం, షూటింగ్ జరపడానికి ఎక్కువమంది భక్తులను ఒక్కసారి వదలడం వల్లే తొక్కిసలాట జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. తొక్కిసలాటకు ముఖ్యమంత్రి కారణమని ఆరోపించారు. అయితే, ఈ ఘటనపై విచారణ జరిపించడానికి సోమయాజులు కమిషన్ వేసింది. ఈ కమిషన్ నివేదికను ఇవాళ ప్రభుత్వ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి వెళ్లిపోయాకే తొక్కిసలాట జరిగిందని, ఒకే ముహుర్తానికి ఎక్కువ మంది భక్తులు రావడం, ఘాట్ చిన్నగా ఉండటంతో ప్రమాదం జరిగిందని కమిషన్ తేల్చింది. ఇది కేవలం రాజకీయాల లబ్ధి కోసమే ఆరోపణలు చేశారని కమిషన్ అభిప్రాయపడింది.

Similar News