139 మంది రేప్ కేసులో ఆ సినిమా హీరో పేరు

139 మంది రేప్ కేసులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో సినిమా ఆర్టిస్ట్ తో పాటు టీవీ ఆర్టిస్టుల పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా బాధిత మహిళ ఫిర్యాదు [more]

Update: 2020-08-24 12:58 GMT

139 మంది రేప్ కేసులో సంచలనాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో సినిమా ఆర్టిస్ట్ తో పాటు టీవీ ఆర్టిస్టుల పెద్ద మొత్తంలో ఉన్నట్లుగా బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇందులో టీవీ రంగానికి చెందిన ప్రముఖులు పేర్లు ఇప్పటికే ప్రస్తావించారు. అయితే దీంతోపాటుగా వినాయకుడు సినిమా హీరో కృష్ణ పేరు కూడా ఇందులో ఉంది. పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నిందితుల 123 పేర్లలో వినాయకుడు హీరో కృష్ణ పేరు కూడా ఉంది.. ఇప్పుడు ఈ విషయం సంచలనం సృష్టిస్తుంది. . ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. అయితే కేసులో ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపైన మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికే సిసిఎస్ పోలీసులకు కేసు బదిలీ చేయాలని అనుకున్నారు. కేసు తీవ్రతను బట్టి సిఐడి దర్యాప్తు చేయించాలని పోలీసులు ఆలోచన చేస్తున్నారు.

Tags:    

Similar News