కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కు ఢిల్లీ పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. ఆయన భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకోవడానికి శశిథరూర్ ప్రేరేపించారని పేర్కొంటూ ఆయన పేరును ఛార్జిషీట్ లో చేర్చారు. ఈ మేరకు పాటియాలా కోర్టులో ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. 2014 జనవరి17న ఢిల్లీలో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అప్పటి నుంచి సునంద మృతి వెనక శశి థరూర్ హస్తం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సునంద శరీరంలో మోతాదుకు మించి మత్తు పదార్థం ఉండటం వల్లే ఆమె మరణించిందని వైద్యులు నివేదిక కూడా ఇచ్చారు. దీంతో ఆమె మృతిపై అనుమానాలు మరింత పెరిగాయి.