సంక్రాంతితో పాటే ఒమిక్రాన్....?

సంక్రాంతి పండగ వస్తోంది. విదేశాల నుంచి సొంతూళ్లకు బయలు దేరి వస్తున్నారు, ఒమిక్రాన్ ను వెంటపెట్టుకుని వస్తున్నారు.

Update: 2021-12-30 07:43 GMT

సంక్రాంతి పండగ వస్తోంది. విదేశాల నుంచి ఎక్కువ మంది సొంతూళ్లకు బయలు దేరి వస్తున్నారు. సంక్రాంతి సంబరాలను చూసేందుకు ప్రతి ఏటా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విదేశాల నుంచి వస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన ఈ జిల్లా వాసులు ప్రతి సంక్రాంతికి వచ్చే సంప్రదాయాన్ని పాటిస్తారు. అదే ఇప్పుడు ఆ రెండు జిల్లాలకు శాపమయింది. విదేశాల నుంచి వచ్చే వారికి ఒమిక్రాన్ సోకుతుండటంతో ఈ రెండు జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

పండగ అంటే ఇక్కడే....
సంక్రాంతి పండగ అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అని చెప్పుకోవాల్సిందే. తినుబండారాల దగ్గర నుంచి కోడి పందేల వరకూ ఈ రెండు జిల్లాల్లో ఉన్న హడావిడి మరెక్కడా ఉండదు. కోడిపందేలకు ఫేమస్ కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వస్తుందటారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒమిక్రాన్ కేసు నమోదయింది. ఒక మహిళ సంక్రాంతి పండగ కోసం కువైట్ నుంచి వచ్చింది. ఆమెకు వైద్య పరీక్షలు చేయగా ఒమిక్రాన్ అని తేలింది.
వేల సంఖ్యలో....
ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే గత నెలలో దాదాపు ఆరువేల మంది, తూర్పు గోదావరి జిల్లాలో ఏడు వేల మందికి పైగానే విదేశాల నుంచి వచ్చారు. వీరంతా ప్రత్యేకించి సంక్రాంతి పండగ కోసం వచ్చిన వారే. విదేశాల నుంచి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నా వారితో కాంటాక్ట్ అయ్యే వారికి కూడా ఒమిక్రాన్ సోకే అవకాశముందని తెలిసింది. అందుకే సంక్రాంతి పండగకు కళకళలాడే ఈ రెండు జిల్లాల ప్రజలు ఒమిక్రాన్ భయంతో వణికిపోతున్నారు. కోడిపందేలు వద్ద జనం గుమికూడే అవకాశముందని, తద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశముందని వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News