బాబాయి అలా అంటే బాధేసింది

తన మతం గురించి బాబాయి మాట్లాడటం బాధ కలిగించిందని సంచయిత గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన తనను అనరాని మాటలు అంటున్నారన్నారు. తాను [more]

Update: 2020-03-07 08:49 GMT

తన మతం గురించి బాబాయి మాట్లాడటం బాధ కలిగించిందని సంచయిత గజపతిరాజు అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన తనను అనరాని మాటలు అంటున్నారన్నారు. తాను హిందువును కాదని అనడం విడ్డూరంగా ఉందన్నారు. వాటికన్ సిటీలో ఫొటో దిగితే తనను క్రిస్టియన్ అంటారా అని సంచయిత మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు కూతురు ఆదితికి ట్రస్ట్ బోర్డులో అవకాశం కల్పించినప్పుడు ఇప్పుడు తన నియామకం పట్ల ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు. అశోక్ గజపతిరాజు ఎప్పుడూ చర్చిలకు, మసీదులకు వెళ్లలేదా? అని సంచయిత ప్రశ్నించారు. మా తాత పీవీజీ రాజుగారి వారసత్వాన్ని అందిపుచ్చుకునే అన్నీ అర్హతలున్నాయన్నారు. తాను గత ఆరేళ్లుగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని సంచయిత చెప్పారు. తనకు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అవ్వడానికి న్నఅి అర్హతలు ఉన్నాయని సంచయిత చెప్పారు. తన పనితీరు చూసిన తర్వాత బాబాయి అశోక్ గజపతిరాజు విమర్శిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News