అరెస్ట్ లు… ఆంక్షలు

తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ చలో బస్సు రోకో పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీన్ని అనుమతికి ఇప్పటికే పోలీసులు [more]

Update: 2019-11-16 04:42 GMT

తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. ఆర్టీసీ జేఏసీ చలో బస్సు రోకో పేరుతో కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దీన్ని అనుమతికి ఇప్పటికే పోలీసులు నిరాకరించారు. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు ఆర్టీసి జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆమరణ దీక్షకు పిలుపునిచ్చారు. తమ కార్మిక సంఘం కార్యాలయంలో ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించారు. అయితే అశ్వద్ధామ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు . ఇవాళ ఉదయం నుంచే అశ్వద్ధామ రెడ్డి ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. అశ్వద్ధామ రెడ్డిని పోలీసులు ఇంటిలోనే నిర్బంధించారు అన్న విషయం విషయం తెలుసుకొని పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు అక్కడికి చేరుకున్నారు.

నేతల ఇంటి వద్ద…..

పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు . రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. పోలీసులు తనను ఇంటి నుంచి బయటికి వెళ్ల నివ్వకపోతే ఇంట్లోనే ఆమరణ దీక్ష చేస్తానని అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు . బస్సులను బయటకు రాకుండా అడ్డుకుంటామని కార్మికుల ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మరో జేఏసీ నేత రాజిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అన్ని ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags:    

Similar News