బ్రీఫ్డ్ మీ అన్నది బాబు కాదా?

Update: 2018-05-09 06:21 GMT

కేసీఆర్ సమావేశాలతో చంద్రబాబు వణికిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రివ్యూ మీటింగ్ పెడితే చంద్రబాబు దాన్నుంచి దృష్టి మరల్చడానికి ఇక్కడ ప్రత్యేక హోదా ర్యాలీలు చేస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసిన చంద్రబాబును కఠినంగా శిక్షించాలని రోజా డిమాండ్ చేశారు. ఆ గొంతు చంద్రబాబు దేనని ఫోరెన్సిక్ నివేదిక తేల్చడంతో చంద్రబాబును శిక్షించాల్సిందేనన్నారు రోజా. బ్రీఫ్డ్ మీ అని ఆయన తప్ప ప్రపంచంలో ఎవరూ అనరని రోజా ఎద్దేవా చేశారు. దొరికిన ఆధారాలను బట్టి ఓటుకు నోటు కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాల్సిందేనని ఆమె కోరారు.

Similar News