రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు?

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటనను హైకమాండ్ విడుదల చేయనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత [more]

Update: 2020-12-25 02:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటనను హైకమాండ్ విడుదల చేయనుంది. అందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. ఎక్కువ మంది రేవంత్ రెడ్డి పేరును సూచించడంతో ఆయననే పీసీసీ చీఫ్ గా నియమించాలని హైకమాండ్ భావిస్తోంది. కేసీఆర్ ను ఎదుర్కొనే ధీటైన నేతగా రేవంత్ రెడ్డిని అధిష్టానం గుర్తించింది. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న కోమటి రెడ్డి వెంకటరెడ్డికి సీడబ్ల్యూసీలో సభ్యుడిగా నియమించనున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీలోకి తీసుకోనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మరికొందరు సీనియర్లను నియమించి వారిలో అసంతృప్తిని తొలగించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News