అందుకే కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం లేదు

సెకండ్ వేవ్ కరోనా ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను దేశంలో రెండు కంపెనీలే [more]

Update: 2021-05-14 01:16 GMT

సెకండ్ వేవ్ కరోనా ను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. కరోనా వ్యాక్సిన్ ను దేశంలో రెండు కంపెనీలే తయారు చేస్తున్నాయని, గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలుస్తున్నారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం కేసులను తగ్గించి చూపుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందువల్లే ఇంజక్షన్లు, వ్యాక్సిన్లు కేంద్ర ప్రభుత్వం తగ్గించి చూపుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులన్నీ కేసీఆర్ బంధువులవేనని, అందుకే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News