బిడ్డా..... రేవంత్ జాగ్రత్త....!

Update: 2018-09-29 10:48 GMT

‘‘నువ్వెంత....నీ బతుకెంత? కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని విమర్శించేవాడివా? అడ్డగోలు మాటలు మాట్లాడితే తాట తీస్తాం. బలిసి కొట్టుకుంటున్నావ్. మా పార్టీ వాళ్లు నన్ను ఆపుతున్నారు. లేకుంటే బిడ్డా...నీ అంతు చూసే వాడిని’’ అంటూ టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ రేవంత్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ పై కాంగ్రెస్ నేత రేవంత్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. గోడల మీద రాతలు రాసుకునే రేవంత్ రెడ్డి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారన్నారు. చిల్లర బతుకు బతికే నువ్వు వేల భూములు ఎలా సంపాదించుకున్నావన్నారు. జాగ్రత్త బిడ్డా...నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారు. నీకు పిల్లనిచ్చిన మామ కోటీశ్వరుడని, ఆయనకు నీకుఆస్తులిచ్చాడని అబద్ధాలు చెప్పడం మానుకోమన్నారు. తెలంగాణ సమాజంలో చీడపురుగులా రేవంత్ తయారయ్యాడన్నారు. చంద్రబాబు ఏజెంట్ గా లోఫర్ పనులు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అడ్డగోలు విమర్శలను కట్టిపెట్టి విచారణను ఎదుర్కోమని సుమన్ సలహా ఇచ్చారు.

Similar News