ఇస్రో-ఐఐఆర్ఎస్ లో ఉద్యోగాలు.. వేతనం, అర్హత వివరాలివిగో !
ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు వెళ్తే.. అక్కడ అభ్యర్థుల అర్హత, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు
డెహ్రాడూన్ : భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు పోస్టుల భర్తీకిన నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రీసెర్చ్ విభాగంలో మొత్తం 20 ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయనక్కర్లేదు. అలాగే ఎలాంటి రాతపరీక్షలు ఉండవు.
ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకు వెళ్తే.. అక్కడ అభ్యర్థుల అర్హత, మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.31,000 నుంచి రూ.56,100 వరకూ వేతనం ఇస్తారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, అర్హత, ఇంటర్వ్యూ వివరాల కోసం ఈ లింక్ ను https://www.iirs.gov.in/ సందర్శించండి.
జూనియర్ రీసెర్చ్ ఫెలో లో 16, రీసెర్చ్ అసోసియేట్ లో 3, రీసెర్చ్ సైంటిస్ట్ 1 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్వ్యూకు వెళ్లగోరే అభ్యర్థులు.. ఇస్రోలోని పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంప్లాన్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నెట్/గేట్/ఐఐఆర్ఎస్-జెట్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరు అయ్యే అభ్యర్థుల వయసు 28 ఏళ్ల నుంచి 35 లోపు ఉండాలి. ఏప్రిల్ 14 నుంచి 22వ తేదీ వరకూ డెహ్రాడూన్ లోని కాళిదాస్ రోడ్ IIRS Security Reception లో ఇంటర్వ్యూలు జరుగుతాయి.