ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ

Update: 2018-07-05 11:07 GMT

రైలు ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. ఇంతకాలం రైల్వే ప్రయాణికులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వంటి ఐడీ ప్రూఫ్స్ తప్పనిసరిగా చూపించాల్సి వచ్చేది. అయితే, ఈ పత్రాలు ప్రయాణంలో పోతాయని భయపడేవారు. ఈ నేపథ్యంలో ఇకనుంచి ప్రయాణికులు ఐడీ ప్రూఫ్స్ తీసుకురావాల్సిన అవసరం లేదని, ఫోన్లలో ఉండే డిజిలాకర్ యాప్ లో చూపిస్తే సరిపోతుందని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ యాప్ లోకి లాగిన్ అయ్యి ఇష్యూడ్ డాక్యమెంట్స్ క్యాటగిరిలో ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ పత్రాన్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక మీదట ఈ రెండింటినీ రైల్వే శాఖ ఐడీ ప్రూఫ్స్ గా పరిగణించనుంది.

Similar News