సీబీఐ దాడులు లేవు.. స్టేట్ మెంట్ మాత్రమే…!!!

బ్యాంకు లో రూ.600 కోట్ల రుణం విషయం పై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని, తమ కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో బ్యాంక్ [more]

Update: 2019-04-30 09:47 GMT

బ్యాంకు లో రూ.600 కోట్ల రుణం విషయం పై బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు వచ్చారని, తమ కంపెనీకి చెందిన లావాదేవీల విషయంలో బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ప్రశ్నించడం జరిగిందని వైసీపీ నేత రఘురామకృష్ణంరాజు తెలిపారు. అంతేకాని సీబీఐ దాడులు ,సోదాలు వంటివి ఏమి లేవని ఆయన తెలిపారు. సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పానన్నారు. ఎన్నికలకు ముందు ఒకసారి వచ్చి తన స్టేట్ మెంట్ ను తీసుకున్నారని, మళ్ళీ ఇప్పుడు వచ్చి మరోసారి స్టేట్ మెంట్ తీసుకున్నారన్నారు. చట్టాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చట్టం తన పని తాను చేసుకుంటుందని ఆయన అన్నారు. బ్యాంకులకు 600 కోట్ల అప్పు ఉన్న మాట వాస్తవమేనని, తమ పవర్ ప్రాజెక్టు కంపెనీలో నష్టాల వల్ల బ్యాంకుకు రుణం తిరిగి చెల్లించలేకపోయామని చెప్పారు. బ్యాంకుకు వన్ టైం సెటల్మెంట్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికలపై కూడా రఘు రామ కృష్ణం రాజు స్పందించారు. నరసాపురంలో తాను లక్ష 20 వేల మెజారిటీ తో గెలుస్తున్నానని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో 120 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు.

Tags:    

Similar News