బ్రేకింగ్ : రాష్ట్రపతి పాలన దిశగా

మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశాగా సాగుతున్నాయి. తొలుత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ అది చేతులెత్తేయడంతో శివసేనను పిలిచారు. శివసేనకు ఇచ్చిన 24 గంటల [more]

Update: 2019-11-12 03:42 GMT

మహారాష్ట్ర రాజకీయాలు రాష్ట్రపతి పాలన దిశాగా సాగుతున్నాయి. తొలుత బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ అది చేతులెత్తేయడంతో శివసేనను పిలిచారు. శివసేనకు ఇచ్చిన 24 గంటల గడువు ముగియడంతో మూడో పెద్ద పార్టీగా ఉన్న ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిచారు. ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఈ పార్టీలు కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాకుంటే రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలున్నాయి. శివసేన తాము ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తామని తెలిపినా గడువు ముగిసిందని గవర్నర్ స్పష్టం చేశారు. ఎన్సీపీకి ఈ రాత్రి వరకూ గడువు విధించారు.

Tags:    

Similar News