ఈ దశాబ్దం మనదే

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. తమ ప్రభుత్వానికి ప్రజలు విస్పష్టమైన తీర్పు నిచ్చారని [more]

Update: 2020-01-31 06:41 GMT

ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ అన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. తమ ప్రభుత్వానికి ప్రజలు విస్పష్టమైన తీర్పు నిచ్చారని తెలిపారు. వివిధ రంగాల్లో భారత్ విశేష ప్రతిభ సాధించిందని రాష్ట్రపతి తెలిపారు. ఈ దశాబ్దంలో దేశం మరింత అత్యున్నత స్థాయికి వెళుతుందని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు అభినందనీయమని చెప్పారు. సీఏఏతో బాపూజీ కల నెరవేరిందని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. రాజ్యాంగానుసారం పనిచేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

పేదలందరికీ లబ్ది…..

పేదలందరికీ లబ్ది చేకూర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్రపతి వివరించారు. గత సమావేశాల్లో అనేక కీలక బిల్లులకు ఆమోదం తెలిపిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీని పెంచేేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. సీఏఏ వల్ల ఎవరికీ నష్టం లేదని, అందరికీ న్యాయం చేయాలనే ఈ బిల్లును తీసుకొచ్చామని రాష్ట్రపతి వివరించారు. గత ఐదేళ్లలో భారత అభివృద్ధి మెరుగుపడిందన్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజలకు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలతో సమానంగా హక్కులు లభించాయని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి నిధులు విడుదల చేశామని చెప్పారు.

అందరికీ సమ న్యాయం…..

పాకిస్థాన్ ఆ దేశంలో మైనారిటీలను టార్గెట్ చేసిందన్నారు. నన్ కానాషాహిబ్ ఘటనను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కిసాన్ సమ్మాన్ నిధితో దేశంలో 8 కోట్ల మంది రైతులు లబ్ది పొందారని చెప్పారు. కొత్తగా 65 మెడకల్ కళాశాలలను ఏర్పాటు చేశామన్నారు. పాలనలో పారదర్శకత కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గిరిజనుల కోసం అనేక పథకాలను ప్రభుత్వం తీసుకు వచ్చిందన్నారు. కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించడం చారిత్రాత్మకమన్నారు. ఆదాయపు పన్ను శాఖను పూర్తిగా డిజిటలైజేషన్ చేశామని చెప్పారు. దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల దేశంగా మార్చేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హింస వల్ల దేశ ప్రతిష్ట దిగజారుతుందని రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News